HARVEST FESTIVAL MSG

             ప్రభువు మెచ్చుకొను అర్పణ  

" ఆయన (యేసు) కానుకపెట్టె యెదుట కూర్చుండి. జనసమూహము కానుకపెట్టెలో డబ్బు వేయుట చూచుచుండెను . "        మార్కు 12 : 41       

దేవునికి ఇవ్వడం లేక అర్పణ చెల్లించడం అనేది దేవుని కృప అని 2కోరింతి 8:1 లో పరిశుద్దుడైన పౌలు స్పష్టంగా తెలియజేసాడు. దేవునికి అర్పణ అర్పించడమంటే పరిశుద్దుల పరిచర్యలో పాలుపొందుట అని  2కోరింతి 9:1లో వ్రాయబడివుంది . దేవునికి   అర్పణ చెల్లించడమంటే పరలోకంలో ధనం కూర్చుకోవడం అని అర్ధం.                                                                                       
సాధారణంగా అర్పణలు చెల్లించే పద్ధతులు 6 విధాలుగా ఉన్నాయి.

  1. గొప్పతనం కోసం దేవునికి ఇవ్వడం (కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియకూడదు)
  2. కోపముతో ఇవ్వడం (తప్పదు కనుక అని దేవునికి అర్పణలు ఇవ్వడం )
  3. అయిష్టములో ఇవ్వడం దేవునికి అర్పణ ఇష్టంతో ఇవ్వాలి . 
  4. దేవుని నుండి ఏదో (ప్రతిఫలం ఆశించి అర్పణలు ఇవ్వడం )
  5. దేవుని పట్ల ప్రేమతో ఇవ్వడం. (సణగుకోకుండా ఇవ్వడం )
  6. సంతోషముతో ఇవ్వడం (ఉత్సాహముగా ఇచ్చే వారిని దేవుడు ఎంతో ప్రేమించును )  

                      నీ అర్పణ ఎలావుంది ?

1. దేవుని నమ్మి ఇచ్చే అర్పణ.     రోమా 4 : 38 ,  గలతి 3 : 6

విధవరాలు కానుక అర్పించింది. కానుక చాలా చిన్నది. రెండు కాసులు మాత్రమే కాని అర్పణ ప్రభువు మెచ్చుకున్నాడు. ప్రభువుకు ఇష్టమైoది. కారణం ఆ బీద విధవరాలు దేవుని నమ్మింది అబ్రహాము దేవుని నమ్మెను కనుక తన ఒక్కగానొక్క కుమారుని దేవుని అర్పించుటకు వెనుతియలేదు. నీవు దేవునికి అర్పణ అర్పించేటప్పుడు ఆ అర్పణ దేవునికి ఇష్టమైన అర్పణగా ఉంటుంది.

2. దేవుని ప్రేమించి అర్పించే అర్పణ.   యోహాను 14 : 23

ఈ బీద విధవరాలు దేవుని ప్రేమించిన స్త్రీ దేవుని ప్రేమించడమంటే మాటలు చెప్పడము కాదు, దేవుని మాట వినడం, దేవుని ఆజ్ఞనుగైకొనుట నీవు ఎంత అర్పణ అర్పించావు అనే దానికంటే నీవు నిజముగా దేవుని ప్రేమించుచున్నావా అనేది చాలా ముఖ్యం దేవుని ప్రేమించే వారికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. రోమ. 8:28 , దేవుని ప్రేమించువాడు దేవుని కొరకు ప్రాణమైనా ఇస్తాడు.

3. దాతృత్వముతో అర్పించే అర్పణ.    2కోరింతి  9 : 2

ఈ బీద విధవరాలు సిద్దమనస్సుతో అర్పణ అర్పించింది. ఎంతోమంది ధనవంతులు ఎంతో ధనం అర్పిస్తున్నారు. వారంతా వారికున్నదానిలో కొంత అర్పించారు. ఈ బీద విధవరాలు ఉన్నదంతా ఇచ్చింది. దాతృత్వము గల మనస్సు గల స్త్రీ దేవునికి అర్పణ అర్పించేటప్పుడు సిద్దమనస్సుతో ఇవ్వాలి. అది దేవునికి ఎంతో ప్రీతికరమగును. దేవునికి ఇవ్వండి దేవుని నుండి సమృద్దిగా పొందుకొండి.