EASTER MSG



       క్రీస్తు మృతులలో నుండి లేపబడి యున్నాడు 

" ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రధమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపపడి యున్నాడు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రధమ ఫలము క్రీస్తు "      కోరింతి 15 ; 20

                     పునరుత్థానములో దాగియున్న మేళ్ళు 


1.  పునరుత్థానము మన విశ్వాసానికి పునాది .    1 కోరింతి 15 ; 17 

"క్రీస్తు లేపబడని యెడల మా విశ్వాసము వ్యర్ధమే "
 యేసు  పునరుత్థానము వాస్తవమా ? నిజంగా యేసు  మృతులలో నుండి లేచాడా ? ఈ ప్రశ్నలు నేటికి ఉన్నాయి .
  పునరుత్థానుడైన ప్రభువు నేటికి మనతో మాట్లాడుచు, మనతో వుంటూ , కార్యములు జరిగించుచున్నప్పటికి మనం కూడా ఎన్నోమారులు అవిశ్వాసులుగా ప్రవర్తిస్తున్నాము . యేసు తన్ను  తను అనేక పర్యాయములు ప్రత్యక్షపరుచుకొని పలురీతులుగా ఆయా వ్యక్తులను బట్టి ఆయా పరిస్థితులను బట్టి ప్రతి వారిలో విశ్వాసమును కలిగించువాడు   యేసు  పునరుత్థానము మన విశ్వాసానికి పునాది .

2.  పునరుత్థానము విశ్వాసాకి శుభప్రధమైన నిరీక్షణ.      1 థెస్స 4 : 14

"యేసు చనిపోయి మళ్లీ సజీవంగా లేచాడని మనము నమ్మినయెడల ఆప్రకారమే యేసులో నిద్రించిన వారిని ఆయనతో కూడా దేవుడు తీసుకవస్తాడు. అంటే అందరం మరణిస్తాం మరలా లేస్తాం మహిమ శరీరాలు దరించుకొంటాం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాము అనే నిరీక్షణ ఈ నిరీక్షణ శుభప్రధమైనది పునరుత్థానుడైన యేసులో లభించింది.

3.  పునరుత్థానములో  విశ్వాసాకి సమాధానము.     యోహాను  20 ; 19,20

"శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసికొనివున్నను వారికి  ప్రత్యక్షమై రెండు సార్లు సమాధానము ప్రకటించాడు . సమాధానలేమి వలన అశాంతికి గురైనా వారికి యేసు సమాధానమిచ్చి దృడపరిచాడు.

" శాంతిని మీ కనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను."   యోహాను 14 : 27