CHIRSTMAS MSG

JESUS BIRTH DAY MSGS

          క్రీస్తు అనబడిన యేసు పుట్టెను 


    "ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను"            మత్తయి 1: 16



లోకరక్షకుడు పరిశుద్దుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, దీవెనలు We wish you a Merry Chritmas మీకు సంతోషకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు . క్రిస్మస్ ఆచారంగా ఆర్బాటంగా జరుపుకునే వేడుకగా కాక ఆత్మ సంబందమైన ఆరాధనగా ఉండాలి క్రిస్మస్ అంటే దేవుడు మానవుడిగా పుట్టడం.  దేవుడు మానవుడిగా ఎందుకు పుట్టవలసి వచ్చింది అసలు ఈ క్రీస్తు అనబడిన యేసు ఎవరు? నాలుగు ప్రాముఖ్య విషయాలను చూద్దాము.

1. యేసు నిజమైన దేవుడు. Jesus is true God     1యోహాను 1 : 20

"మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించియున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన  యేసుక్రీస్తునందున్నావారమై సత్యవంతుని యందున్నాము  ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమై యున్నాడు.
మానవులందరు నిజదేవుని అన్వేషణలో ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరు? అని తెలుసుకోడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కన్య మరియ గర్భాన ఉద్బవించిన క్రీస్తు అనబడిన క్రీస్తు ఎవరో కాదు నిజమైన దేవుడు.
 నిజమైన దేవుని ఆత్మతో అరదించడమే నిజమైన క్రిస్మస్.

2. యేసు మహా దేవుడు.         Jesus is Great God          తీతు 2 ; 13

"అనగా మహా దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకము స్వస్థ బుద్దితోను, బ్రతుకుచుండవలెనని బోదించుచున్నది. 
మహాదేవుడు అంటే దేవుళ్ళకు దేవతంలందరికి ఫైనున్న అని అర్ధం అందరి కంటే గొప్ప మహాత్యము గలవాడని అర్ధం, భూమిని పాదపీటముగా,ఆకాశమును సింహాసనుముగా చేసికొని ఈ భూమండలమంత పట్టజాలనంత  మహాదేవుడు పవిత్రుడుగా జన్మించిన క్రీస్తు అనబడిన ఈ యేసు ఎవరో కాదు మహాదేవుడు మహాదేవుని జననమే క్రిస్మస్.

3. యేసు బలవంతుడైన దేవుడు.      Jesus is Mighty God        యెషయ 6 : 9

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును.బలవంతుడంటే అసాధ్యాలను సుసాధ్యము చేయగల దేవుడు ఏదైనా చేయుటకు శక్తి గల దేవుడని అర్ధం. ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా కాపాడగలిగిన దేవుడు. క్రీస్తు అనబడిన యేసు ఎవరో కాదు. బలవంతుడైన దేవుని జననమే క్రిస్మస్. 

4. యేసు సర్వాధికారియైన దేవుడు.       Powerful God       ప్రకటన 11 : 17

వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి నేవు మహాబలమును స్వీకరించి యేలుచున్నావు. గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. పరలోకమందు భూలోకమందు సర్వాధికారముగల ఏకైక సత్యదేవుడు క్రీస్తు అనబడిన యేసు సర్వ మానవాళి పాప ప్రక్షాళన కొరకు, పాప పరిహారము చేయడము కొరకు ప్రాణాన్ని అర్పించిన ప్రాయచిత్తము చేసిన ఏకైక సత్యదేవుడు యేసుక్రీస్తు ఆయనను ఆరాదించువారు ధన్యులు.