01-10-2017

                          "నీ మందిరమునందు నివసించువారు ధన్యులు"


నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు."
                                                                                         కీర్తనల గ్రంథము అధ్యాయం 84:4

ధన్యుడవు  అంటే దేవుని చేత దీవింపబడినవాడవు . ధన్యులు అంటే నిత్యం ఆనందమయులు . ఈ ఆనందం 

పరలోకం నుండి  అనుగ్రహింపబడినది.  ధన్యులు అంటే పరలోక ఆనందాన్ని భూలోకంలో ఆనందించేవారు. 

ఎవరైతే దేవుని మందిరములో నివసించాలని ఎవరైతే దేవుని మందిరమును ప్రేమిస్తారో వారు ధన్యులు. 

కీర్తనల గ్రంథము అధ్యాయం 84:10


 నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దిన ములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో        నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. 

ప్రతి మానవునికి కొన్ని ఇష్టాలుంటాయి. ఆ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 

దేవుని మందిరం పట్ల ఎవరు శ్రద్ద కలిగి వుంటారో వారు ధన్యజీవులు. 

దేవుని మందిరంలో ఎవరు నివసించగలరు ?

Psalms - కీర్తనలు 15:1-5 ( 11 అర్హతలు కలవు )

1. యథార్థమైన ప్రవర్తన గలవారు. 
2.  నీతి ననుసరించు గలవారు. 
3 నిజము పలుకువాడే.
4. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. 
5. నమ్మినవాడికి కీడు చేయడు . ( తన చెలికానికి కీడు చేయడు)
6. తన పొరుగువానిమీద నింద మోపడు. 
7. యెహోవాయందు భయభక్తులు గలవారినిసన్మానించును. 
8. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.
9.  తన ద్రవ్యము వడ్డికియ్యడు. 
10.  లంచము పుచ్చుకొనడు. 
11.  నిరపరాధిని చెరుపడు. 

దావీదు దేవుని ఒక వరం అడుగుతాడు.
 కీర్తనల గ్రంథము అధ్యాయం 27:4యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిర ములో నివసింప గోరుచున్నాను.

నీ ప్రార్ధనలో నీమందిరములో గడుపుతాను అని ఎప్పుడైనా అడుగుతున్నావా ?

కీర్తనల గ్రంథము అధ్యాయం 84:2
యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయు చున్నవి. 
నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీ మందిరములో నివసించుట ఎంతో గొప్ప ధన్యత. 

కీర్తనల గ్రంథము అధ్యాయం 122:1
యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. 
దేవుని మందిరానికి వచ్చినపుడు సంతోషముతో రావాలి. ఎవరి హృదయము దేవునికి సమీపముగా ఉంటుందో వారు సకాలమునకు మందిరములో వుంటారు. దేవుని మందిరములో  నివసించాలంటే కొన్ని అర్హతలున్నవి. 

మొదటి విషయం-ఎవరైతే  దేవుని మందిరములో నివసించే ధాన్యతను కోరుకుంటున్నారో  నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము.
ప్రసంగి అధ్యాయం 5:1
  నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. 
 అన్ని చోట్లకు వెళ్లినట్లుగా దేవుని మందిరమునకు వెళ్ళకూడదు. నీ ప్రవర్తన జాగ్రత్తగా  చూచుకుంటే నీవు  ధన్యుడవు.  
హగ్గయి అధ్యాయం 1:6,7
మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. 
 కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి. 
నీ  ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.  దేవుని మందిరములో నీ ప్రవర్తన బాగుంటే అంతా  మంచిదే  . 
నీ ప్రవర్తన బాగా లేకపోతే తృప్తిలేదు. 
నీ ప్రవర్తన  బాగా లేకపోతే సంవృద్దిలేదు. 
ఎందుకంటే  నీ  ప్రవర్తననుగూర్చి ఆలోచించుకో  జీవము గల దేవుని మందిరములో   నీ  ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో.
 దేవుని మందిరములో  నివసించు వారు ధన్యులు. 

రెండవ విషయం :   నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు.
                                                                                                                         కీర్తనల గ్రంథము అధ్యాయం 84:4
ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించాలి. ఎందుకు దేవుని మందిరానికి వెళ్లాలంటే దేవుని ఆరాధించాలి , స్తుతించాలి. ఇది మనుషులను గొప్పగా చేసుకునే స్థలం కాదు. ఇది దేవుని స్తుతించే స్థలం. ఎవరైతే దేవుని స్తుతించుతారో వారి స్తుతులు పైకి వెళ్ళుతాయి. స్తుతించిన వారి స్తుతులు దేవుని సన్నీ దానానికి వెళ్లి నీ పై ఆశీర్వాదాలు దిగివస్తాయి. దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించుట. ఎంత ఎక్కువగా నీవు స్తుతించుతావో అంత ఎక్కువగా ఆశీర్వదింపబడతావు.  తక్కువగా స్తుతించేవారు తక్కువగా ఆశీర్వదింపబడతారు . 
హన్నా దేవుని మందిరానికి వచ్చింది. దేవుని స్తుతించింది ఆశీర్వదింపబడి వెళ్ళింది. 
జక్కయ్య  దేవుని మందిరములో దూపం వేశాడు దీవించబడి వెళ్ళినాడు. 

మూడవ  విషయం :  నా మందిరము ప్రార్థన మందిరం.   
                                                        మత్తయి సువార్త అధ్యాయం 21:13
ఇది ప్రభువు పలికిన మాట. ప్రభువు తన నోటితో స్వయంగా పలికిన మాట . ఎంతో కఠోరమైన మాట. 
యెరూషలేము  మందిరములో ప్రార్థనకు బదులు డబ్బు మారకం ఎక్కువైపోయింది. ప్రభువు యెరూషలేము 
దేవాలయములోకి ప్రవేశించినపుడు  ప్రార్థనలు వినబడాల్సిన స్థలంలో రూకల చప్పుడు వినబడుతుంది.  నా మందిరము ప్రార్థన మందిరం.ఇది దొంగల గుహ కాదు. 
యెషయా గ్రంథము అధ్యాయం 56:7
నా ప్రార్థన మందిరములో నివసించే వారిని  నేను ఆనందింపజేసెదను. 
ఎవరైతే దేవుని మందిరములో ప్రార్ధనలు చేస్తారో వారు ధన్యులు. 
కీర్తనల గ్రంథము అధ్యాయం 18:6
ఆయన తన ఆలయములో  నా ప్రార్థనను ఆలకించి  అంగీకరించెను. నీ ప్రార్ధన వింటాడు, ఆలకిస్తాడు , అంగీకరిస్తాడు. దేవుని మందిరములో చేయబడు  ప్రార్ధనను  ఆలకిస్తాడు , అంగీకరిస్తాడు. 
కీర్తనల గ్రంథము అధ్యాయం 36:8
నీ మందిరముయొక్క సమృద్ధివలన అందరు సంతృప్తి నొందుచున్నారు.
దేవుని మందిరములో  సంవృద్ది ఉంది . 
దేవుని మందిరములో  తృప్తి ఉంది .
దేవుని మందిరములో ఆశీర్వాదం వుంది. 
ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నారు?
కీర్తనల గ్రంథము అధ్యాయం 16:11
జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం    నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆశీర్వాదం. 
దేవుని మందిరములో నివశించే వారు ధన్యులు. 






SONGS



01 - GOODULENI - baptist church.mp3/ 02 - - baptist church.mp3/ 03 - Aadharam Naaku - baptist church.mp3/ 04 - Alayamlo - baptist church.mp3/ 05 - - baptist church.mp3/ 06Chalayya - - baptist church.mp3/ 07 - Deva - baptist church.mp3/ 08 - - baptist church.mp3/ 09 -jesus - baptist church.mp3/ 10 - Kalamu ledika - baptist church.mp3/ 11 - Naa asrayama - baptist church.mp3/ 12 - - baptist church.mp3/ 13 - - baptist church.mp3/ 14 - - baptist church.mp3/ 15 - Yesune premanu - baptist church.mp3/ 16 - Chirakala snehituda -mp3/ 17 - Hallelooya -mp3/
18 - S.P.B - .mp3/

Prabhudas Pastor videos

(Role of Children towards Parents) by Prabhudas Pastor



(Keep oneself from being polluted by the world) by Prabhudas Pastor 


(Role of a Wife in Christian family) by Prabhudas Pastor



 
Prabhudas Pastor (God's Love) Part 1



Prabhudas Pastor (God's Love) Part 2




Prabhudas Pastor (God's Love) Part 3




Prabhudas Pastor (God's Love) Part 4



Prabhudas Pastor (Be Courageous) PART 1




Prabhudas Pastor (Be Courageous) Part 2




Prabhudas Pastor (Be Courageous) Part 3




Prabhudas Pastor (Be Courageous) Part 4




                                       
Prabhudas Pastor (Be Righteous).. (Part 1)




Prabhudas Pastor..(Be Righteous)..(Part 2)




Prabhudas Pastor (Be Righteous)..(Part 3)





Prabhudas Pastor (Be Righteous) (Part 4)





Prabhudas Pastor (Be Righteous) (Part 5)


Prabhudas Pastor (Be Holy).. (Part 1)


Prabhudas Pastor (Be Holy).. (Part 2)



Prabhudas Pastor (Be Holy). (Part 3)


Prabhudas Pastor (Be Holy).. (Part 4)

దేవునికివ్వడంలో ఆశీర్వాదములు

         దేవునికి ఇవ్వడంలో ఆశీర్వాదములు  

" ఇయ్యుడి . అప్పుడు మీకియ్యబడును. అణచి , కుదిలించి , దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతు ఆ కొలతతోనే మీకు మరల కోలువబడునని చెప్పెను "                                                                                                                                                                   లూకా 6 : 38 

1. దేవునికి ఇవ్వడం ద్వారా కృపకు పాత్రులమవుతాము.          2 కొరింథీ 8 : 3

ఈ కృప విషయములోను , పరిశుద్దుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను మనః పూర్వకముగా మిమ్మును వేడుకొనుచు వారు తమ సామర్ధ్యము కొలదియే గాక సామర్ధ్యము కంటే ఎక్కువగాను ఇచ్చిరి .

2. దేవుని వాక్యమును నెరవేర్చిన వారమవుతాము.   మలాకీ 3:10

నా మందిరములో ఆహారము ఉండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్ళను విప్పి పట్టు జాలనంతగా దీవెనలు కుమ్మరించెదను.

3. దేవుని ఘనపరిచిన వారమవుతాము.      సామెతలు 3 : 9

నీ రాబడి అంతటిలో ప్రధమ ఫలమును నీ ఆస్థిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఇవ్వడమంటే దేవున్ని ఘనపరచడం.

4. దేవుని చేత ప్రశంసింపబడుతాము.         మార్కు 12 : 42

ఒక బీద విధవరాలు రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరి కంటే ఈ బీద  విధవరాలు ఎక్కువ వేసెనని  మీతో నిచ్చయముగా చెప్పు చున్నాననెను .

5. దేవుని నుండి సంతోషం పొందుతాము .          1 దిన 29 ; 9,10

వారు పూర్ణ మనస్సుతో యోహోవాకు ఇచ్చి యుండురి గనుక వారు అలాగు మనః పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి.   

SUVARTHA PRAKATINCHUDI

                               సువార్త ప్రకటించుడి 

"మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి".       మార్కు 16 : 15-16


యేసుక్రీస్తు నామములో మీకు శుభములు దీవెనలు సమృద్దిగా కలుగును గాక !
సర్వ లోకమునకు సువార్త ప్రకటించాలి . ఇది ప్రభువు యొక్క ఆదేశం . ఎవరు సువార్త ప్రకటించాలి ? ఎవరి భాధ్యత 
 సువార్త  ప్రకటించే భారం ఎవరి మీద వుంది ?  సువార్త  ప్రకటించే పని ప్రభువుని వెంబడించే ప్రతి శిష్యుని భాధ్యతగా
గుర్తించాలి . కొందరి మీద మాత్రం కాదు .

1. పౌలు సాక్షం .        1 కోరింథి  9 : 16


      అయ్యో ! నేను సువార్తను ప్రకటింపక పోయిన యెడల నాకు శ్రమ అని పరిశుద్దుడైన పౌలు తన వేదనను వ్యక్తం చేస్తున్నాడు . ఈ రోజుల్లో  సువార్త  ప్రకటించే వారిలో కొందరి మనస్థత్వాలు గ్రహించితే వారికి   సువార్త  ప్రకటించాలానే భారమున్నట్లు కనపడదు . రోమా 1:14-16 లో సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను . సువార్తను గూర్చి నును సిగ్గు పడువాడను కాదు అని పౌలు ప్రకటించాడు .

2. సువార్తను ప్రకటించే వారి పాదములు సుందరములు .          యెషయా 52 : 7


సువార్తను ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమనమును ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించు వాణి పాదములు , నీ దేవుడు ఏలుచున్నాడని  చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి .  సువార్త  ప్రకటించే దేవుని బిడ్డలు దేవుని దృష్టిలో ఎంత శ్రేష్టులో మనం గ్రహించగలం .  సువార్త  ప్రకటించే వారి పాదములే అంత సుందరములైతే  వారి ముకము ఎంత మనోహరమైనదో  కదా !

3. సువార్తను ప్రకటించేవారు జ్యోతులవలె ప్రకాశిస్తారు .   దానియేలు 12 : 3


బుద్దిమంతులైతే ఆకశామందలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు . నీతిమార్గముననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములవలె నిరంతరం  ప్రకాశించెదరు. సువార్తను  ప్రకటించి  అనేకులను  నీతిమార్గములో నడిపించే సువర్తికుని పాదములు  పర్వతములఫై మాత్రమే సుందరము కాదుకానీ  నిరంతరం  ప్రకాశించే  నక్షత్రముగా దేవుని దృష్టిలో నిలిచిపోతారు . ఈ భాగ్యము ఇశ్రాయేలియలుకు లెదు. ఎందుకంటే వారు యేసు రక్తం క్రిందికి రాకుండా యేసుని నిరాకరించారు . కాబట్టి నశించి పోవుచున్న లోకానికి  సువార్తను ప్రకటించే భాగ్యము దేవుడు విశ్వాసులమైన మనకే ఈ గొప్ప క్రుపను అనుగ్రహించాడు .

 4. ఆజ్ఞ అతిక్రమమే పాపం.        1యోహాను 3 : 4 


 సువార్తను ప్రకటించే బాధ్యత నాదికాదు. ఆది సంఘాలు, సంస్థలు , సేవకులు చేయవలసిన పని అని సాకులు చెప్పే వారున్నారు . సువార్త ప్రకటించుట అనేది ఒక ఆజ్ఞ అని మరువ వద్దు. సువార్త ప్రకటించుటకు కదలిరండి . నశించి పోవుచున్న మన ఇరుగు పొరుగు వారికీ రక్షణ సువార్త  అందించుట మన బాధ్యత సుమా !