SUVARTHA PRAKATINCHUDI

                               సువార్త ప్రకటించుడి 

"మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి".       మార్కు 16 : 15-16


యేసుక్రీస్తు నామములో మీకు శుభములు దీవెనలు సమృద్దిగా కలుగును గాక !
సర్వ లోకమునకు సువార్త ప్రకటించాలి . ఇది ప్రభువు యొక్క ఆదేశం . ఎవరు సువార్త ప్రకటించాలి ? ఎవరి భాధ్యత 
 సువార్త  ప్రకటించే భారం ఎవరి మీద వుంది ?  సువార్త  ప్రకటించే పని ప్రభువుని వెంబడించే ప్రతి శిష్యుని భాధ్యతగా
గుర్తించాలి . కొందరి మీద మాత్రం కాదు .

1. పౌలు సాక్షం .        1 కోరింథి  9 : 16


      అయ్యో ! నేను సువార్తను ప్రకటింపక పోయిన యెడల నాకు శ్రమ అని పరిశుద్దుడైన పౌలు తన వేదనను వ్యక్తం చేస్తున్నాడు . ఈ రోజుల్లో  సువార్త  ప్రకటించే వారిలో కొందరి మనస్థత్వాలు గ్రహించితే వారికి   సువార్త  ప్రకటించాలానే భారమున్నట్లు కనపడదు . రోమా 1:14-16 లో సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను . సువార్తను గూర్చి నును సిగ్గు పడువాడను కాదు అని పౌలు ప్రకటించాడు .

2. సువార్తను ప్రకటించే వారి పాదములు సుందరములు .          యెషయా 52 : 7


సువార్తను ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమనమును ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించు వాణి పాదములు , నీ దేవుడు ఏలుచున్నాడని  చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి .  సువార్త  ప్రకటించే దేవుని బిడ్డలు దేవుని దృష్టిలో ఎంత శ్రేష్టులో మనం గ్రహించగలం .  సువార్త  ప్రకటించే వారి పాదములే అంత సుందరములైతే  వారి ముకము ఎంత మనోహరమైనదో  కదా !

3. సువార్తను ప్రకటించేవారు జ్యోతులవలె ప్రకాశిస్తారు .   దానియేలు 12 : 3


బుద్దిమంతులైతే ఆకశామందలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు . నీతిమార్గముననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములవలె నిరంతరం  ప్రకాశించెదరు. సువార్తను  ప్రకటించి  అనేకులను  నీతిమార్గములో నడిపించే సువర్తికుని పాదములు  పర్వతములఫై మాత్రమే సుందరము కాదుకానీ  నిరంతరం  ప్రకాశించే  నక్షత్రముగా దేవుని దృష్టిలో నిలిచిపోతారు . ఈ భాగ్యము ఇశ్రాయేలియలుకు లెదు. ఎందుకంటే వారు యేసు రక్తం క్రిందికి రాకుండా యేసుని నిరాకరించారు . కాబట్టి నశించి పోవుచున్న లోకానికి  సువార్తను ప్రకటించే భాగ్యము దేవుడు విశ్వాసులమైన మనకే ఈ గొప్ప క్రుపను అనుగ్రహించాడు .

 4. ఆజ్ఞ అతిక్రమమే పాపం.        1యోహాను 3 : 4 


 సువార్తను ప్రకటించే బాధ్యత నాదికాదు. ఆది సంఘాలు, సంస్థలు , సేవకులు చేయవలసిన పని అని సాకులు చెప్పే వారున్నారు . సువార్త ప్రకటించుట అనేది ఒక ఆజ్ఞ అని మరువ వద్దు. సువార్త ప్రకటించుటకు కదలిరండి . నశించి పోవుచున్న మన ఇరుగు పొరుగు వారికీ రక్షణ సువార్త  అందించుట మన బాధ్యత సుమా !