దేవునికి ఇవ్వడంలో ఆశీర్వాదములు
" ఇయ్యుడి . అప్పుడు మీకియ్యబడును. అణచి , కుదిలించి , దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతు ఆ కొలతతోనే మీకు మరల కోలువబడునని చెప్పెను " లూకా 6 : 38
1. దేవునికి ఇవ్వడం ద్వారా కృపకు పాత్రులమవుతాము. 2 కొరింథీ 8 : 3
ఈ కృప విషయములోను , పరిశుద్దుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను మనః పూర్వకముగా మిమ్మును వేడుకొనుచు వారు తమ సామర్ధ్యము కొలదియే గాక సామర్ధ్యము కంటే ఎక్కువగాను ఇచ్చిరి .
2. దేవుని వాక్యమును నెరవేర్చిన వారమవుతాము. మలాకీ 3:10
నా మందిరములో ఆహారము ఉండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్ళను విప్పి పట్టు జాలనంతగా దీవెనలు కుమ్మరించెదను.
3. దేవుని ఘనపరిచిన వారమవుతాము. సామెతలు 3 : 9
నీ రాబడి అంతటిలో ప్రధమ ఫలమును నీ ఆస్థిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఇవ్వడమంటే దేవున్ని ఘనపరచడం.
4. దేవుని చేత ప్రశంసింపబడుతాము. మార్కు 12 : 42
ఒక బీద విధవరాలు రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరి కంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిచ్చయముగా చెప్పు చున్నాననెను .
5. దేవుని నుండి సంతోషం పొందుతాము . 1 దిన 29 ; 9,10
వారు పూర్ణ మనస్సుతో యోహోవాకు ఇచ్చి యుండురి గనుక వారు అలాగు మనః పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి.